NTV Telugu Site icon

Sri lanka: అదానీ ప్రాజెక్టులో అమెరికా భారీ పెట్టుబడులు.. చైనాకు చెక్ పెట్టేందుకు వ్యూహం..

Colombo

Colombo

Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.

ఈ నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబోని నౌకాశ్రయ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి అమెరికా డీఎఫ్‌సీ 553 మిలియన్ డాలర్లను నిధులను సమకూర్చుతోంది. కొలంబోలోని డీప్ వాటర్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్‌(డబ్ల్యుసీటీ) లో పెట్టుబడులు పెట్టనుంది. ఆసియాలో అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఇది శ్రీలంక అభివృద్ధితో పాటు, భారతదేశంతో సహా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహిస్తుందని, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC) ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Isreal-Hamas War: తోటి ప్రజాప్రతినిధి వ్యాఖ్యలపై సెన్సార్.. అమెరికా ప్రతినిధుల సభలో కీలక పరిణామం..

ఈ ప్రాజెక్టులో అదానీకి 51 శాతం వాటా ఉండగా.. శ్రీలంక సంస్థ జాన్ కీల్స్ హెల్డింగ్స్ 34 శాతం వాటాను కలిగగి ఉంది. మిగిలిన మొత్తం శ్రీలంక ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రీలంక పోర్ట్స్ అథారిటీకి వాటాగా కలిగి ఉంది. గతేడాది చైనా శ్రీలంకలో 2.2 బిలియన్ల పెట్టుబడి పెట్టింది. దీంతో పాటు చైనా రుణ ఉచ్చులో ఇరుకున్న శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు ఇచ్చింది. తాజాగా కొలంబో పోర్టులో భారత్, అమెరికాలు కలిసి పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనాకు చెక్ పెట్టవచ్చు. హిందూ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో కొలంబో ఒకటి.

గతేడాది నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను భారత్ ఆదుకుంది. 4 బిలియన్ల క్రెడిట్ లైన్‌లను విస్తరించింది. ఇంధనం, ఔషధం, ఎరువులు దిగుమతుల్లో మద్దతుగా సాయం చేసింది. ఇదిలా ఉంటే జూలై నెలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పర్యటించారు. ఆ సమయంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. కొలంబో పోర్టులోని డబ్ల్యూసీటీ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టుతో పాటు 500 మెగావాట్ల విండ్ ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం వంటి ప్రాజెక్టుల గురించి చర్చించారు.