Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
- భోపాల్ రైతుల ఆందోళనలో వైరల్ అయిన ఏసీపీ మోనికా శుక్లా వీడియో.
- కదులుతున్న బస్సు ముందు నిలబడి అడ్డుకున్న మహిళా పోలీస్ అధికారి.
- సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైతులు నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పెసర పంటను కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమించారు. సీఎం మోహన్ యాదవ్ నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనల నేపథ్యంలో ఏసీపీ మోనికా శుక్లా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారుల బస్సు ముందు నిలబడి అడ్డుకున్న శుక్లాపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిరసనకారులు పోలీస్ బారికేడ్లు తొలగించి, బస్సును కదిలించేందుకు ప్రయత్నించారు. ఏసీపీ మోనికా శుక్లా బస్సుకు అడ్డంగా నిలబడి, తన చేతులతో దాని కదలికను అడ్డుకున్నారు. కొంతసేపు ఉద్రిక్తతల తర్వాత నిరసనకారులు బస్సును అక్కడే వదిలేశారు.
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో భోపాల్ రైతులు, పెసరపప్పును 100% కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు కొనుగోలు చేయాలని, ఇ-టోకెన్ వ్యవస్థను మెరుగుపరచాలని, మరియు సరసమైన ధరలకు ఎరువులను సకాలంలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. రైతులు నర్మదాపురం మరియు ఇతర ప్రాంతాల నుండి భోపాల్‌కు పాదయాత్ర చేసి, రాజధానిలోని వీర్ సావర్కర్ వంతెన సమీపంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం తమకు హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని చెబుతున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
During the farmers movement in Bhopal, when the agitating farmers were taking the bus to the Chief Minister's residence, ACP Monika Shukla stood in front of the bus and did not allow the bus to proceed.#Monikashukla #Bhopal #FarmerProtestMP pic.twitter.com/u9ETP7BHbt
— Pramod Jagtap (@PramodSJagtap) July 30, 2026
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!