Accident in Jabalpur: మధ్యప్రదేశ్ జబల్పుర్లో రాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కారు డ్రైవర్ అతివేగంతో కారు నడుపుతూ ఇంటి ముందు బైక్‌పై కూర్చున్న యువకులను ఢీకొట్టాడు. అనంతరం కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్నవారు కారును అక్కడే వదిలి పారిపోయారు. ఈ దారుణ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
Read also: Heavy Rain Telangana: తెలంగాణాలో దంచికొడుతున్న వానలు.. జిల్లాల్లకు భారీ వర్ష సూచన
రాంఝీ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం రాత్రి రావణ దహన కార్యక్రమం ఉందని రాంఝీ పోలీసులు తెలిపారు. రాంఝీ నివాసి అయిన పింటూ బర్మన్ రావణ దహన్‌ని చూడటానికి వెళ్ళాడు. అతను మళ్లీ ఇద్దరు అక్కలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. పింటూ అనే యువకుడు ఇంటి ముందు రోడ్డు పక్కన బైక్‌పై కూర్చున్నాడు. ఇంతలో ఎంపీ 20 సీఎం 9666 నంబర్ గల కారు డ్రైవర్ పింటూ బైక్‌ను ఢీకొట్టాడు. పింటూ దూకి నేలమీద పడ్డాడు. కారు కూడా అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. గాయపడిన పింటూను ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. కారులో ఇద్దరు వ్యక్తులు వున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఇద్దురు అక్కడినుంచి పారిపోయారు. వారిద్దరు మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Ajay Mishra: ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోంది.