Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..

  • బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు..
  • దీప్కే తల్లి సంచలన ఆరోపణలు..
Abhijit Deepke

Abhijit Deepke

Abhijit Deepke: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆమె తల్లి ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించడంతో తమ కుటుంబం తాత్కాలికంగా తమ ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో నివసిస్తున్న దీప్కే తల్లిదండ్రులు కొద్దికాలం పాటు కొంకణ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు వెళ్లినట్లు తెలుస్తోంది.

అభిజిత్ తల్లి అనితా దీప్కే మాట్లాడుతూ.. తమ కుమారుడికి బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. అభిజిత్‌ను బీజేపీలో చేరాలని బెదిరించడంతో పాటు అలా చేయకపోతే తల్లిదండ్రుల్ని టార్గెట్ చేస్తామని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అభిజిత్ మొదట్లో తన కుటుంబానికి ఈ బెదిరింపుల గురించి చెప్పలేదని, ఆ తర్వాత తెలియజేసి తమను ఇంటికి దూరంగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. తన కొడుకు బెదిరింపులకు భయపడలేదని, మాకు ఇలాంటి బెదిరింపులు కొత్త అని, అందుకే ఆందోళన చెందామని అనితా దీప్కే చెప్పారు. కొంకణ్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే 16 రోజులు ఉన్నట్లు వెల్లడించారు. సామాజిక, ప్రజాజీవితంలో ఇలాంటి విమర్శలు, బెదిరింపులు సహజమని అభిజిత్ తండ్రి భగవాన్ దీప్కే అన్నారు.