NTV Telugu Site icon

INDIA bloc: కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఆప్.. పంజాబ్‌లో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటన..

India Bloc

India Bloc

INDIA bloc: ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఈ కూటమి ఉంటుందా.? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో ప్రధాన రూపశిల్పిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జతకట్టాడు. ఇది ఇండియా కూటమిని మనోబలాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది.

Read Also: AIIMS: 9 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తుల్లో “కుట్టు సూది”.. తొలగించిన ఎయిమ్స్ వైద్యులు..

ఇదిలా ఉంటే, తాజాగా పంజాబ్ లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఆప్ అస్సాంలో కూటమితో సంబంధం లేకుండా మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్ కనీసం ఈ సారి 40 స్థానాలైనా గెలుస్తుందా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెబుతోంది.