AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…

  • రాఘవ్ చద్దా దెబ్బకు విలవిల్లాడుతున్న ఆప్..
  • ద్రోహులంటూ పార్టీ మారిన ఎంపీలపై ఆగ్రహం..
  • హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ కార్యకర్తల దాడి..
Aap Crisis

Aap Crisis

AAP Crisis: రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. రాజ్యసభలో 2/3 వంతు పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం కేజ్రీవాల్‌కు పెద్ద ఎదురుదెబ్బ. మరోవైపు, ఆప్ నేతలు, కార్యకర్తలు పార్టీ మారిన ఎంపీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ నివాసంపై ఆప్ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటిపై ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ నల్ల సిరాతో రాశారు. ఆప్ కార్యకర్తలు నల్ల బ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు.

Read Also: KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

మరోవైపు, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. పార్టీని వీడిన ఎంపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ మారిన వారంతా ద్రోహులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్‌కే కాకుండా పంజాబ్ ప్రజల నమ్మకానికి ద్రోహం చేశారని ఆయన అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ ఫిరాయింపులకు పాల్పడుతోందని సీఎం ఆరోపించారు. ఆప్‌ను దెబ్బతీయడానికి బీజేపీ భయం, ప్రలోభాలకు తెర తీస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో మత దూషణలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు అమలు చేసినప్పటి నుంచి బీజేపీ అసంతృప్తిగా ఉందని మాన్ అన్నారు.