Site icon NTV Telugu

90 Degree turn Bridge: ఒరేయ్ ఎవడ్రా ఈ వంతెన కట్టింది.. 90 డిగ్రీల మలుపుతో ప్రమాదాలు

Bridge

Bridge

90 Degree turn Bridge: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌ నగరంలోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఓ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభానికి ముందే.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అయితే, ఈ వంతెన నిర్మాణానికి భూమి కొరత ఏర్పడటంతో.. సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటంతో ఈ బ్రిడ్జిను ఇలా నిర్మించక తప్పలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ వంతెన మహామై కా బాగ్, పుష్పా నగర్, స్టేషన్ ప్రాంతం నుంచి న్యూ భోపాల్‌కు రాకపోకలు కొనసాగుతాయి.. ఈ ఓవర్‌బ్రిడ్జిపై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయి.. భారీ వాహనాలను అనుమతించబోమని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ వి డి వర్మ తెలిపారు.

Read Also: Mithra Mandali : నవ్వుల తుపాన్‌గా దూసుకొచ్చిన ‘మిత్ర మండలి’ టీజర్..!

అయితే, 2023 మార్చిలో ఈ వంతె నిర్మాణానికి ముందు.. ఐష్‌బాగ్ ప్రాంత ప్రజలు రైల్వే క్రాసింగ్ దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.. కానీ, ఇప్పుడు అవసరం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. 3 లక్షల మంది ఈ బ్రిడ్జి వల్ల ప్రయోజనం పొందుతారని చెప్పారు. సుమారు రూ.18 కోట్లతో నిర్మించిన ఈ ఓవర్‌బ్రిడ్జి 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు ఉంది. కానీ, ఈ వంతెనలో ఉన్న 90 డిగ్రీల మలుపు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికలు భయపడుతున్నారు. కాగా, ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియా ప్రత్యక్షం కావడంతో నెటిజన్స్ ఈ వంతెన డిజైన్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒరేయ్ ఎవడ్రా ఈ వంతెన కట్టింది అని సెటైర్లు వేస్తున్నారు.

Exit mobile version