Lucknow Wall Collapse: శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని ఫోన్ కాల్ రక్షించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Wall Collapse: శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గోడ కూలిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ గోడ కూలిన సమాచారం అందించింది బాధితుడేనని తెలిసింది. శిథిలాల కింద చిక్కుకున్న గోలు అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. పోలీసులకు ఫోన్ చేసిన ఒక్కడే ఈ ప్రమాదంలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.24 గంటలకు భారీ వర్షం మధ్య వచ్చిన ఫోన్‌కాల్‌లో అత్యవసర సాయం కోసం అర్థించారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీసు స్టేషన్, అగ్నిమాపక దళానికి సందేశం పంపబడింది. తర్వాత 15 నిమిషాల్లో, పోలీసు యంత్రాంగం నడుము లోతు నీటిలో నడుస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నట్లు వారు తెలిపారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..
“పోలీస్ స్టేషన్‌కు సందేశం పంపబడిన 15 నిమిషాల తర్వాత మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము, మా మొదటి ప్రాధాన్యత, ప్రయత్నం కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడం, అతనిని శిథిలాల నుండి బయటకు తీయడం. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన గోలు అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసిన అనంతరం అతనిని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ (సివిల్) ఆసుపత్రికి పంపారు. ” అని ఏసీపీ అనూప్ కుమార్ సింగ్ వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని గోడను క్రమంగా పగులగొట్టి శిథిలాలను తొలగించారు. దీంతో మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఉదయం 9.30 గంటల వరకు కొనసాగింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!