NTV Telugu Site icon

Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..

Earthquake

Earthquake

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపlలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.

Read Also: Amritpal Singh Case: ఐదో రోజు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట.. ఇండో-నేపాల్ బోర్డర్‌లో హై అలర్ట్..

ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఫైజాబాద్ కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమి నుంచి 188 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం తర్వాత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులను కోరినట్లు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తెలిపారు. ఆఫ్ఘన్ లో అన్ని ఆరోగ్య కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు.

ఈ భూకంపం వల్ల ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు జమ్మూకశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రకంపనలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా ప్రకంపలను వచ్చాయి, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Show comments