NTV Telugu Site icon

Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు

Assam Floods

Assam Floods

అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగంలోకి బృందాలను బాధితులను శిబిరాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే వరదలు కారణంగా చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. ఇక కాజిరంగా నేషనల్ పార్క్‌లోకి వరద నీరు చేరుకుంది. దీంతో 233 అటవీ చెక్‌పోస్టులలో 95 ముంపునకు గురయ్యాయి. అలాగే కర్బీ అంగ్లాంగ్‌లోని పొరుగున ఉన్న కొండలకు అడవి జంతువులు వెళ్లిపోయాయి.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: జీతం తీసుకోనన్న పవన్.. దణ్ణం పెట్టిన డైరెక్టర్!!

ఇక రాబోయే నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 3-4 రోజులు రాష్ట్రానికి చాలా క్లిష్టమైనవని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. బ్రహ్మపుత్ర, దేశాంగ్, సుబంసిరి, దేఖో, బురిదేహింగ్, బెకి మరియు బరాక్ వంటి అస్సాం గుండా ప్రవహించే వివిధ నదులు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..

రాష్ట్ర విపత్తు రెస్క్యూ ఫోర్స్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి తొమ్మిది మంది సిబ్బందితో కూడిన ధేమాజీ జిల్లాలోని రెస్క్యూ టీం కూడా జూన్ 30న ఆపరేషన్ మధ్యలో సియాంగ్ నదిలో బోటు బోల్తా పడటంతో విమానంలో తరలించాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!