యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. తుఫాన్ ప్రభావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అలర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్‌డీఆర్‌ఎఫ్.. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల పరిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇక, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంటుందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ఇప్పటికే ఒడిశాలో 52 ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌లు పనిచేస్తుండగా.. పశ్చిమ బెంగాల్‌లో 45 టీమ్‌లో పనిలో ఉన్నాయి.. ఇటు ఏపీలోనూ.. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది సర్కార్.. ఇవాళ సంబంధిత జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
యాస్ తుఫాన్.. 8 లక్షల మందికి పైగా సురక్షితప్రాంతలకు తరలింపు
NDRF