8 Fetuses Found: 21 రోజుల నవజాత శిశువు కడుపులో 8 పిండాలు.. అరుదైన చికిత్స విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8 Fetuses Found: కడుపు నొప్పితో బాధపడుతున్న నవజాత శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాపకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు 8 పిండాలను వెలికితీశారు. దీనితో ఆ పాప కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. అరుదైన సందర్భంలో, ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ సమయంలో 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలను కనుగొన్నట్లు వైద్యులు తెలిపారు.పిండాల పరిమాణం మూడు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు ఉందని, అవి పొత్తికడుపులోని తిత్తిలో స్థిరపడ్డాయని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ ఎండీ ఇమ్రాన్ వెల్లడించారు.
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్ 10న పాప జన్మించింది. కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, కడుపులో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. 21 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత నవంబర్1న ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద పాపకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో కడుపులో ఉన్నవి కణితలు కాదని, పిండాలు అని నిర్ధరణ కాగా.. వారు షాక్‌కు గురయ్యారు. అలా ఎనిమిది అభివృద్ధి చెందని పిండాలను వైద్యులు తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఫీటస్-ఇన్-ఫీటూ కేసులు 100 కంటే తక్కువ ఉంటాయని వైద్యులు చెప్పారు. అయితే.. ఆయా కేసుల్లో కడుపు నుంచి ఒక పిండాన్ని మాత్రమే తొలగించారు. ఇలాంటి కేసు బహుశా ప్రపంచంలోనే మొదటిది అయ్యుండచ్చని పాపకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు పేర్కొన్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Dmitry Medvedev: సాతానుకు వ్యతిరేకంగా రష్యా పవిత్ర యుద్ధం చేస్తోంది..
ఆపరేషన్ విజయవంతమైంది, ప్రస్తుతం శిశువు పరిస్థితి సాధారణంగా ఉంది. పాపను అబ్జర్వేషన్లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. ఇది అరుదైన కేసు కాబట్టి దీని గురించి అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించడానికి సిద్ధం చేస్తున్నామని రాంచీలోని రాణి ఆసుపత్రి అధిపతి రాజేష్ సింగ్ అన్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్ ప్రకారం, వైద్య పరిభాషలో, దీనిని ఫెటస్-ఇన్-ఫీటూ (ఎఫ్ఐఎఫ్) అని పిలుస్తారు.
తాజావార్తలు
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!