Abhishek Banerjee: నా ప్రాణాలు తీయడానికి ఇది ఏడో ప్రయత్నం.. బీజేపీపై అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో కోల్‌కతాలోని తన నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. గత ఆరు నెలల్లో తన ప్రాణాలు తీయడానికి ఇది ఏడో ప్రయత్నమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పలు వీడియోలను షేర్ చేసిన అభిషేక్ బెనర్జీ.. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న తన నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు, అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. న్యాయవ్యవస్థ కూడా ప్రేక్షకపాత్ర వహిస్తోందని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, పశ్చిమ బెంగాల్లో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అభిషేక్ వ్యాఖ్యానించారు. గత ఆరు నెలల్లో తనపై ఏడుసార్లు ప్రాణాంతక దాడులకు ప్రయత్నించారని, అయినప్పటికీ పోలీసుల నుంచి సరైన చర్యలు కనిపించడం లేదని అన్నారు.
Also Read
- Man Swallows Toothbrush: టూత్ బ్రష్ మింగేశాడు..డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే..
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
- Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆరోపణల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో అభిషేక్ బెనర్జీ నివాసం వద్దకు వచ్చిన బీజేపీ మద్దతుదారులు ‘చోర్.. చోర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అభిషేక్ బెనర్జీ కటౌట్లు, బ్యానర్లను ధ్వంసం చేసినట్లు తృణమూల్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘర్షణల్లో పలువురు టీఎంసీ కార్యకర్తలు గాయపడినట్లు వెల్లడించారు. ఘటన అనంతరం అభిషేక్ బెనర్జీ ఇంటి నుంచి బయటకు వచ్చి తెల్లవారుజామున 2:45 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడే ఉన్నారు. అదుపులోకి తీసుకున్న టీఎంసీ కార్యకర్తను విడుదల చేసిన అనంతరం, పోలీసులు విజ్ఞప్తి చేయడంతో తిరిగి ఇంట్లోకి వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు.
అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అభిషేక్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలను ఫుట్‌పాత్‌పై జరుపుకోవడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. ఎవరైనా అక్కడ గందరగోళం సృష్టిస్తే దానికి ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. అభిషేక్ బెనర్జీని చంపడానికి ఎవరికి సమయం ఉందని ప్రశ్నిస్తూ, రాజకీయంగా చెప్పడానికి, చేయడానికి ఏమీ లేకపోవడంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దిలీప్ ఘోష్ విమర్శించారు.
అభిషేక్ బెనర్జీపై గతంలోనూ దాడి జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. మే నెలలో సోనార్పూర్ పర్యటన సందర్భంగా ఆయనపై గుడ్లు, రాళ్లతో దాడి జరిగినట్లు పార్టీ పేర్కొంది. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అని, ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని టీఎంసీ ఆరోపించింది. అప్పటి నుంచి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అభిషేక్ బెనర్జీ తరచూ విమర్శలు చేస్తున్నారు. తనపై జరుగుతున్న దాడుల వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.
దాడి ఘటనకు ముందు రోజు కూడా అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కార్యాలయం, నివాసం పరిసరాల్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిఘా పెట్టారని, గత కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వారిని ప్రశ్నించగా తాము పోలీసులమని చెప్పినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టి సారించాలని కోరారు. సంబంధిత వ్యక్తుల గుర్తింపును వెల్లడించేందుకు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తన రెక్కీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన కొద్దిసేపటికే తెల్లవారుజామున 2 గంటలకు బీజేపీ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని అభిషేక్ మరోసారి ఆరోపించారు. కోల్‌కతా పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. అయితే, ఈ దాడి ఆరోపణలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Abhishek Banerjee: నా ప్రాణాలు తీయడానికి ఇది ఏడో ప్రయత్నం.. బీజేపీపై అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు!
-
Telangana PG Medical Seats : తెలంగాణలో పీజీ సీట్ల జాతర.. ఒకేసారి 359 పెంపు
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
ట్రెండింగ్
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!