Site icon NTV Telugu

Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు

Cloudburst

Cloudburst

జమ్మూకాశ్మీర్‌ను వరదలు విడిచిపెట్టడం లేదు. కనీసం తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బతో క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలను బెంబేలెత్తించేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు.. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. తాజాగా శనివారం కూడా మరో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రాంబాన్‌ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఏడుగురు చనిపోగా.. పలువురు గల్లంతైనట్లుగా సమాచారం. ఇక ఇళ్లులు ధ్వంసమయ్యాయి. ఇక జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్మీ సాయంతో సహాయ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన మోడీ

శుక్రవారం పూంచ్, రియాసి, రాజౌరి, కిష్త్వార్, ఉధంపూర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక పూంచ్, కిష్త్వార్, జమ్మూ, రాంబన్, ఉధంపూర్ జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నారింజ హెచ్చరిక జారీ చేసింది. అన్నట్టుగా రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగింది.

ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్

 

Exit mobile version