NTV Telugu Site icon

Covid variant JN.1: దేశంలో 63 కొత్త వేరియంట్ కేసులు.. టాప్‌లో గోవా, తెలంగాణలో కూడా నమోదు..

Covid 19 Jn.1

Covid 19 Jn.1

Covid variant JN.1: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ఆదివారం రోజు దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉంటే.. సోమవారం 4054కి యాక్టీవ్ కేస్ లోడ్ పెరిగింది.

Read Also: 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం ఉంది: దామోదర రాజనర్సింహ

తాజాగా దేశంలో విస్తరిస్తున్న JN.1 వేరియంట్ ఓమిక్రాన్ వేరియంట్‌కి వారసుడిగా చెబుతున్నారు. అయితే దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవని, చాలా సందర్భాల్లో రోగులు ఇంటి వద్దే సాధారణ లక్షణాల నుంచి కోలుకుంటుంటారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 4054 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఒక్క కేరళలోనే 128 యాక్టీవ్ కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 73, మహారాష్ట్రలో 50, రాజస్థాన్ లో 11, తమిళనాడులో 9, తెలంగాణలో 8 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మరణాల సంఖ్య 5,33,334కి చేరుకుంది. తాజా ఇన్‌ఫెక్షన్‌లతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,09,248)కి చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 315 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది.

Show comments