Site icon NTV Telugu

Chhattisgarh: మోడీ టూర్‌కు ముందు కీలక పరిణామం.. 50 మంది మావోలు లొంగుబాటు

50naxalitessurrender

50naxalitessurrender

ప్రధాని మోడీ ఆదివారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం 100 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.

అయితే ఆదివారం ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ మధ్య మావోయిస్టులకు వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇందులో 14 మంది మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిపై దాదాపుగా రూ.5లక్షల వరకు రివార్డ్ ఉంది.

ఇది కూడా చదవండి: Puri Jagannadh : అఫీషియల్.. విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించిన పూరీ జగన్నాథ్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం 50 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వారిలో 14 మందిపై మొత్తం రూ.68 లక్షల రివార్డ్స్ ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఉద్యమంలో ఏర్పడిన విభేదాలలు కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. మావోలు సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని ఆయన తెలిపారు. ఆయుధాలు అప్పగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఉద్యమం విడిచిపెట్టి ప్రజా స్రవంతిలోకి వచ్చే మావోలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: SRH Ugadi Wishes: తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌ఆర్‌హెచ్ టీం.. వీడియో వైరల్

 

Exit mobile version