ప్రధాని మోడీ ఆదివారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం 100 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.