NTV Telugu Site icon

Bengaluru: నర్సింగ్‌ కళాశాలలో అగ్నిప్రమాదం.. 5 బస్సులు దగ్ధం

Fire

Fire

బెంగళూరులోని హెగ్గనహళ్లి క్రాస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న ఐదు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఐదు బస్సులు దగ్ధం కాగా.. మిగతా బస్సులను తప్పించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటలు వ్యాపింపకుండా విజయవంతంగా మంటలు ఆర్పినట్లు రాజగోపాల్ నగర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Mohan Babu: ‘కల్కి’ సినిమా అద్భుతం… మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌ అంటూ మోహన్ బాబు రివ్యూ

కళాశాలకు చెందిన స్థలంలోనే బస్సులు నిలిపి ఉన్నాయి. ఉన్నట్టుండి బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. కొద్దిసేపటికే ఒక బస్సు నుంచి పక్కనే ఆగి ఉన్న ఇతర బస్సులకు వ్యాపించాయి. కళాశాల అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానిక అగ్నిమాపక దళానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.

ఇది కూడా చదవండి: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆగి ఉన్న బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని తెలిపారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదనని పేర్కొన్నారు.