Site icon NTV Telugu

Brain-Eating Amoeba: ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ .. కేరళలో 4వ కేసు నమోదు..

Brain Eating Amoeba

Brain Eating Amoeba

Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని అరుదైన ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. కలుషిత నీటిలో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మానవ శరీరంలోకి చేరి చివరకు ప్రాణాలను తీస్తుంది. నేగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా వల్ల ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’ అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనిని మెదడును తినే అమీబాగా వ్యవహరిస్తుంటారు.

కోజికోడ్ జిల్లాలోని పయోలి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ప్రస్తుతం ఈ వ్యాధితో పోరాడుతున్నాడు. అతడికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మే నెల తర్వాత నుంచి కేరళలో ఇది నాలుగో కేసు. ఇప్పటికే ఈ వ్యాధి సోకిన ముగ్గురు పిల్లలు మరణించారు. తాజా కేసులో బాలుడు జూలై 1న ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు చెప్పారు. అతని పరిస్థితి మెరుగవుతోందని వైద్యలు వెల్లడించారు. వ్యాధిని త్వరగా గుర్తించడంతో, విదేశాల నుంచి తీసుకువచ్చిన మందులతో సహా చికిత్సను వెంటనే ప్రారంభించినట్లు చెప్పారు.

Read Also: Singireddy Niranjan Reddy : ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదు

అంతకుముందు బుధవారం కోజికోడ్‌లో ఈ ఇన్ఫెక్షన్ బారిన బరి 14 ఏళ్ల బాలుడు మరణించారు. అంతకు ముందు మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక, కన్నూర్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక మే, జూన్ నెలల్లో మరణించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్వహించిన సమావేశంలో అపరిశుభ్రమైన నీటి ప్రదేశాలలో స్నానం చేయకూడదని, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి అనేక సూచనలు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, చెరువుల్లో క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. అమీబా ఇన్ఫెక్షన్ రాకుండా ముక్కులకు క్లిప్‌లు ఉపయోగించాలని సూచించారు.

Exit mobile version