UPI: పండగ సీజన్ వేళ.. 42 శాతం మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: పండగ సీజన్ ప్రారంభమైంది. వినాయచవతి, దసరా, దీపావళి ఇలా వరసగా పండగలు వస్తుండటంతో దేశవ్యాప్తంగా బిజినెస్ పుంజుకుంటోంది. ఇప్పటికే అన్ని ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫారంలతో పాటు అనేక షాపింగ్ మాల్స్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా డిజిటల్ చెల్లింపులపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం వినియోగదారులు తమ చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)ని వాడుతామని చెప్పారు. దీనికి అదనంగా 57 శాతం మంది రివార్డులు, క్యాష్ బ్యాక్ ని పొందడం కోసం యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తామని అన్నారు. అమెజాన్ ఇండియా తరుపున నీల్సన్ మీడియా ఇండియా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: Interpol: ఖలిస్తాన్ ఉగ్రవాది కరణ్‌వీర్ సింగ్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, UPI ఆధారిత చెల్లింపులు ఆగస్టులో మొదటిసారిగా 10 బిలియన్ నెలవారీ లావాదేవీలను దాటాయి. యూపీఐ నెలవారీ లావాదేవీల సంఖ్య రూ. 15.18 ట్రిలియన్ల నికర లావాదేవీల విలువతో 10.24 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. సర్వే ప్రకారం దాదాపుగా 75 శాతం మంది ఎలక్ట్రానిక్ వస్తువలైన స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. బ్యూటీ బ్రాండ్స్, హోమ్ ఫర్నిషింగ్ ఐటెమ్స్ ను కొనుగోలు చేస్తామని వినియోగదారులు చెబుతున్నారు.
మెట్రోపాలిటన్ నగరాల్లో 87 శాతం, టైర్ -2 నగరాల్లో 86 శాతం మంది వినియోగదారులు పండగ కోసం వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తేలింది. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్ల కోసం ఎదురుచూస్తున్నారని సర్వే తెలిపింది. 80 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్లలో దుస్తులు, ఫుట్ వేర్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది పండగ సీజర్ లో 90,000 కోట్ల విలువైన ఆన్‌లైన్ గ్రాస్ మర్చండైజ్ విలువ (GMV)ని చూసే అవకాశం ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక ప్రకారం ఇది గతేడాది పండుగ నెల అమ్మకాలతో పోలిస్తే 18-20 శాతం పెరిగిందని తెలిపింది.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!