దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే థర్డ్‌వేవ్ వచ్చినట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. వారం రోజుల తేడాలో దాదాపు 44 వేల కరోనా కేసులు పెరిగాయి. వారం క్రితం 13వేలు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం 58వేల మార్కుకు చేరుకున్నాయి.
Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు
గత వారం రోజులుగా నమోదైన కేసుల వివరాలను గమనిస్తే డిసెంబర్ 30న 13,154, డిసెంబర్ 31న 16,764, జనవరి 1వ తేదీన 22,775, జనవరి 2వ తేదీన 27,553, జనవరి 3వ తేదీన 33,750, జనవరి 4వ తేదీన 37,379, జనవరి 5వ తేదీన 58,097 కేసులు నమోదవుతూ వచ్చాయి. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే త్వరలోనే రోజుకు లక్ష కేసులు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో రోజుకు 10 లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ తప్పనిసరిగా ధరిస్తూ శానిటైజర్ వాడుతూ భౌతికదూరం పాటించండి.