Bihar’s IIT Village: కేంద్రం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ గ్రామం.. జేఈఈ మెయిన్‌లో 40 మంది ఉత్తీర్ణత
- ఒకే గ్రామం నుంచి జేఈఈ మెయిన్‌లో 40 మందికి పైగా ఉత్తీర్ణత..
- బీహార్‌లోని గయ జిల్లాలో ‘ఐఐటీ విలేజ్’గా పేరు పొందిన పఠ్వాఠోలీ గ్రామం ..
- ఒకేసారి 40కి పైగా అర్హత సాధించడంతో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఐఐటీ విలేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar’s IIT Village: జేఈఈ మెయిన్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. ఇందులో 2,50,236 మంది కటాఫ్ స్కోర్ సాధించి.. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారు. ఈ అర్హత పొందిన వారిలో సుమారు 40 మందికి పైగా ఒకే గ్రామానికి చెందిన వారు ఉన్నారు. బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో ‘ఐఐటీ గ్రామం’గా పేరు పొందిన పఠ్వాఠోలీ నుంచి వారంతా ఉత్తీర్ణత సాధించడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. అందులో వృక్ష సంస్థాన్ కోచింగ్ సెంటర్ నుంచి 28 మంది శిక్షణ పొందారు.
Read Also: Madhubala: చిరంజీవి కుర్చీలోంచి లేచి అలా అంటే షాక్ అయ్యాను!
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ఇక, ఈ గ్రామం ‘ఐఐటీ విలేజ్’గా పేరు పొందడానికి 1991లోనే బీజం పడింది. ఆ ఊరి నుంచి ఆ ఏడాది జితేంద్ర పఠ్యా ఐఐటీలో సీటు పొందాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ పరంగా ఎదిగి, అమెరికా స్థిరపడ్డాడు. కానీ తన మూలాలను మర్చిపోకుండా మిగతా వారు తన లాగే ఎదగాలని, “వృక్ష వి ద చెంజ్” పేరిట ఒక ఎన్జీఓను స్థాపించారు. ఇక, అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఐఐటీ అనే పదం వినపడుతుంది. సుమారు 20 వేల మంది గ్రామస్థులు ఉన్న పఠ్వాఠోలీని గతంలో మాంచెస్టర్ ఆఫ్ బీహార్‌గా పిలవగా.. వస్త్ర పరిశ్రమలు, చేనేత పని చేసుకునే వాళ్లు అక్కడ ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ గ్రామం ఇంజినీర్లకు నిలయంగా మారింది. ఇప్పటికీ అక్కడి కుటుంబాలు చేనేత పని చేస్తున్నారు.. వారి పిల్లలు మాత్రం విద్యారంగంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు.
Read Also: Heart Attack: క్రికెట్ ఆడుతుండగా ఆగిన గుండె.. గ్రౌండ్‌లోనే మరో యువకుడు మృతి
అయితే, 2013లో ఏర్పాటైన వృక్ష సంస్థాన్.. ఐఐటీల్లో చదవాలనుకునే వారికి ఫ్రీ కోచింగ్ ఇస్తుంది. గ్రాడ్యుయేట్లు అందించే నిధులతో మెటీరియల్స్ అందజేస్తుంది.. ఢిల్లీ, ముంబైలో నివసించే వారు ఆన్లైన్ వేదికగా విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు.. చాలా కుటుంబాల్లో తమ పిల్లలను పట్టణాలకు పంపించి చదవించలేని పరిస్థితి ఉండటంతో.. అలాంటి వారి కోసమే మేం వృక్ష వేద చెయిన్‌ను ప్రారంభించామని.. ఒక లైబ్రరీ మోడల్‌ను ఏర్పాటు చేశామని ఆ సంస్థ ప్రెసిడెంట్ దుబేశ్వర్ ప్రసాద్ తెలియజేశారు. 10వ తరగతి వరకు చదవడమే కష్టమైన ఆ గ్రామంలో బాలికలు ఉన్నత విద్యవైపు వెళ్లడానికి అవకాశాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ విద్యార్థులు నీట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!