Site icon NTV Telugu

Suvendu Adhikari: బెంగాల్‌లో 40 రాఫెల్స్, బంగ్లాదేశ్‌కి 2 చాలు.. సువేందు వార్నింగ్..

Suvendu Adhikari

Suvendu Adhikari

Suvendu Adhikari: బీజేపీ నాయకుడు, బెంగాత్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బంగ్లాదేశ్‌కి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేతపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌కి 2 రాఫెల్ విమానాలు సరిపోతాయని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హాట్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఘోజదంగాలో బంగ్లాదేశ్‌లో హిందువులపై మతపరమైన హింసను ఖండిస్తూ నిరసన తెలిపారు.

Read Also: M Jethamalani: జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్, సోనియా గాంధీ అపవిత్ర బంధం..

మంగళవారం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా బంగియా హిందూ రక్షా సమితి చేపట్టిన నిరసన కార్యక్రమంలో సువేందు అధికారి ప్రసంగించారు. ‘‘మేము బంగ్లాదేశ్‌పై ఆధారపడటం లేదు. బంగ్లాదేశ్ మాపై ఆధారపడి ఉంది… మేము 97 ఉత్పత్తులను పంపకపోతే, మీకు బియ్యం, బట్టలు లభించవు. మేము జార్ఖండ్ నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును పంపకపోతే, 80% గ్రామాలకు వెలుతురు ఉండదు’’ అని అన్నారు. ‘‘హసియారాలో 40 రాఫెల్ విమానాలు ఉన్నాయి. కేవలం రెండు విమానాలను పంపితే బంగ్లాదేశ్ నాశనం అవుతుంది’’ అని హెచ్చరించారు.

హిందువులపై దౌర్జన్యాలు, దేవాలయాల విధ్వంసానికి ముగింపు పలకాలని బంగ్లాదేశ్‌ని కోరారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని తాలిబాన్ ప్రభుత్వంతో పోల్చారు. ఉగ్రవాద రాడికల్, మానవ వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. మైనారిటీలపై 88 మత హింసాత్మక సంఘటనలు జరిగాయని, 70 మందికి పైగా అరెస్టయినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది.

Exit mobile version