NTV Telugu Site icon

Mumbai: జనాలపైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి, 29 మందికి గాయాలు

Mumbai

Mumbai

Mumbai: ముంబైలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం (డిసెంబర్ 9) రాత్రి 9.30 గంటల సమయంలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. అయితే, ఆ బస్సు డ్రైవర్‌ సంజయ్‌ మోర్‌ కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా డ్యూటీ చేస్తున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం విచారణ చేస్తోంది. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌ను ఎంక్వైరీ చేస్తున్నారు.

Read Also: pushpa 2 : ఓవర్సీస్ లో మైల్ స్టోన్ మార్క్ అందుకున్న పుష్ప రాజ్

ఇక, కుర్లాలోని ఎస్‌జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, మరో ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Read Also: Belagavi: బెళగావిపై రెండు రాష్ట్రాలు మళ్లీ ఘర్షణ.. ఆదిత్య ఠాక్రే, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం!

కాగా, ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బస్సు డ్రైవర్‌ సంజయ్‌ మోర్‌ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ప్రమాదంలో గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో జరిగిన ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయపడ్డారు. పలువురు ప్రాణ భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఇక, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది.

Show comments