Site icon NTV Telugu

Patalkot Express: పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 కోచ్‌లు దగ్ధం..

Patalkot Express

Patalkot Express

Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

READ ALSO: China: చైనాలో వెలుగులోకి 8 రకాల కొత్త వైరస్‌లు.. మరో మహమ్మారిపై ఆందోళన..

ముందుగా రైలు బోగీల్లో మంటలు కనిపించడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ తరువాత మంటలు వేగంగా నాలుగు కోచులకు వ్యాపించాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. స్థానిక రైల్వే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎగిసిపడిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన కంపార్ట్మెంట్ల నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version