Site icon NTV Telugu

West Bengal: ఇక, బెంగాల్‌ వంతు..? బీజేపీతో టచ్‌లోకి 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు..!

Mithun Chakraborty

Mithun Chakraborty

భారతీయ జనతా పార్టీ నేత మిథున్‌ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో చర్చగా మారాయి.. అసలే, తమకు సరైన మెజార్టీ లేని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. అప్రజాస్వామిక పద్దతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను కూల్చివేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో.. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి.. మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? మతో 38 తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.. వారిలో 21 మంది ప్రత్యక్షంగా టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు.. దీనిపై మీడియా మళ్లీ మళ్లీ ప్రశ్నించగా.. ట్రైలర్‌ను విడుదల చేయమని నన్ను అడగవద్దు, సంగీతాన్ని ఆస్వాదించండి అని వ్యాఖ్యానించారు.

Read Also: New Twist in Saipriya Case: మరోసారి ఝలక్‌ ఇచ్చిన సాయిప్రియ..!

బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు “ఆపరేషన్ లోటస్” ప్లాన్ చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత మిథున్‌ చక్రవర్త ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.. అయితే, రెండు రోజుల క్రితం, మమతా బెనర్జీ.. బీజేపీకి సవాలు విసిరారు, శివసేనలో తిరుగుబాటు తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనం కావడం గురించి ప్రస్తావిస్తూ, ఇందులో బీజేపీ సహాయక పాత్ర పోషించిందని.. బీజేపీ ఎజెండాలో తన రాష్ట్రం తర్వాతి స్థానంలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర ఈసారి యుద్ధం చేయలేకపోయింది. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు బెంగాల్ అంటున్నారని.. కానీ, ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి.. మీరు బంగాళాఖాతం దాటాలి.. మొసళ్ళు మిమ్మల్ని కొరుకుతాయి.. రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని కొరికేస్తుంది.. ఉత్తర బెంగాల్‌లో ఏనుగులు మీపైకి దొర్లుతాయి అంటూ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

బెంగాల్‌లో తనను గద్దె దించేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. గత సంవత్సరం, రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అన్ని వనరులను మరియు దాని అగ్ర నాయకులను దింపినా.. కఠినమైన సవాలుతో పోరాడిన తర్వాత ఆమె బెంగాల్‌లో మూడవసారి సీఎం సీటును అధిష్టించారు.. కాగా, మిథున్ చక్రవర్తి గత సంవత్సరం ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటాలతో బీజేపీలో చేరారు, అయితే, సినీ నటుడిగా బెంగాల్‌లో భారీ ప్రజాదరణ ఉన్నప్పటికీ ఓటర్లపై తగినంత ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు మిథున్‌ చక్రవర్తి కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు టీఎంసీ ఎంపీ డోలా సేన్..

Exit mobile version