Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
Read Also: Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..
కాలేజ్ తో చదువుతున్న సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారెు. సత్యం బీటెక్ చదువుతుండగా.. అమన్ బీకామ్, అమిత్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరంతా కలిసి డబ్బులు సంపాదించేందుకు కాన్పూర్ లోని దబౌలి ప్రాంతంలో ఓ మారుతి వ్యాన్ ను కొట్టేశారు. అయితే అక్కడి నుంచే ఈ ముగ్గురి కష్టాలు మొదలయ్యాయి. కారు నడపడం ముగ్గురికి తెలియకపోవడంతో రాత్రి 10 కిలోమీటర్లు వ్యాన్ ను తోసుకుంటూ వెళ్లారు. కార్ నెంబర్ ప్లేట్ తొలగించారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ ప్రాంతంలో దాచిపెట్టారు.
ముగ్గురు నిందితులను మే 7న దబౌలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లుగా ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. కార్ నడపడం రాకపోవడంతో దబౌలి నుంచి కళ్యాణ్ పూర్ వరకు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెల్లారని తెలిపారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని, ఒకవేళ కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.