NTV Telugu Site icon

Jammu Kashmir: భద్రతా బలగాల కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

Irein

Irein

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సైన్యం, పోలీసులపై జరిగిన దాడుల్లో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉగ్రవాదులే భారత సైన్యంపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలు: బయటపెట్టిన నాగ్‌ అశ్విన్

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల వరుస దాడులకు పాల్పడుతున్నారు. దీంతో డోడా, రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదుల్ని తుడిచిపెట్టే ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆపరేషన్‌ మొదలుపెట్టిన భద్రతా దళాలకు.. అక్కడ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం వచ్చింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపాయి. ఇందులో ముగ్గురు కుట్రదారులు హతమయ్యారు.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: ఉన్నది రూ.7 కోట్లేనన్న అధికారులు.. ఆశ్చర్యపోయిన డిప్యూటీ సీఎం పవన్..

భద్రతా దళాలపై జూన్‌ 11న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులతో పాటు ఓ పోలీసు అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు. మరో ఘటనలో పోలీస్‌ క్యాంపుపైనా దాడులు చేశారు. మరోవైపు భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌ కోట్‌ జిల్లాలోనూ భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడా హైఅలర్ట్‌ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: చివరి నిముషంలో మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Show comments