Site icon NTV Telugu

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం

Jammu Kashmir

Jammu Kashmir

3 Terrorists Killed In Gunfight With Security Forces In Jammu: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నిన్న జమ్మూ సమీపంలోని ఉధంపూర్ లో 15 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసిన ఘటన మరవక ముందే ఈ ఎన్‌కౌంటర్ చోటు జరిగింది. బుధవారం ఉదయం జమ్మూాలోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులుకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు.

Read Also: Earthquakes: నేపాల్‌లో వరసగా రెండు భూకంపాలు

ఓ ట్రక్కు కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు దాన్ని వెంబడించారు. ఈ క్రమంలో ట్రక్కు నడుపుతున్న వ్యక్తి పారిపోయాడు. ట్రక్కులోపల చూసేందుకు ప్రయత్నించినప్పుడు అందులో ఉన్న ఉగ్రవాదులు జమ్మ కాశ్మీర్ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఏడీజీపీ ముఖేష్ సింగ్ వెల్లడించారు. రోడ్డును బ్లాక్ చేసిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటను అదుపు చేశాయి. ఘటనాస్థలం నుంచి 7 ఏకే-47 తుపాకులు, 3 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

దీనికి ముందు రోజు జమ్మూ సమీపంలోని ఉధంపూర్‌లో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని పోలీసులు నిర్వీర్యం చేయడంతో పెద్ద ఉగ్రవాద దాడి తప్పింది. ఐఈడీ, 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్, ఏడు 7.62 ఎంఎం క్యాట్రిడ్జ్‌లు, ఐదు డిటోనేటర్‌లను స్వాధీనం చేసుకోవడంతో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. దీంతో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన లెటర్ ప్యాడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి.

Exit mobile version