Looting Bride: మ్యాట్రిమోనియల్ సైట్లలో భార్యలను కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారే టార్గెట్ గా ఓ దోపిడి పెళ్లి కూతురు చేసిన మోసం బయటకు వచ్చింది. పెళ్లి చేసుకుని ఆ తర్వాత భర్త, అత్తింటి వారిపై కేసులు పెట్టి.. వేధించి వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకునే సీమా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా (నిక్కి) అనే మహిళ 2013లో మొదట ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త, కుటుంబ సభ్యులపై కేసు పెట్టి వారి దగ్గరి నుంచి రూ. 75 లక్షలు వసూలు చేస్కోని.. ఆ తర్వాత కేసును విత్ డ్రా చేసుకుంది. అలాగే, 2017లో గురుగ్రామ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని.. అతడి నుంచి విడిపోయేందుకు రూ. 10 లక్షలు తీసుకుంది.
Read Also: Bashar al-Assad: రష్యాలోని సిరియా మాజీ అధ్యక్షుడికి షాక్.. విడాకులు కోరిన భార్య!
కాగా, అనంతరం గతేడాది జైపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఇంకోసారి వివాహం చేసుకుంది. ఆ తర్వాత రూ. 36 లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయింది. దీంతో ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. నిందితురాలు సీమాను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అలా వివిధ రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుని ఇప్పటి వరకు రూ. 1.25 కోట్లను సెటిల్‌మెంట్ల రూపంలో వసూలు చేసినట్లు జైపూర్ పోలీసులు చెప్పారు.