మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. ఈ ముగ్గురి మావోలపై రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు మరణించారని.. వారిపై రివార్డు ఉందన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయన్నారు. చనిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌పైన రూ.15లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్ మనోజ్‌తో పాటు రమే అనే మహిళపై చెరో రూ.8లక్షల రివార్డు ఉందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించే ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు వెల్లడించారు. అలాంటి ప్రాంతాల్లో బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Asaduddin Owaisi: మోడీ జీ.. మీ ఫ్రెండ్ అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి