NTV Telugu Site icon

Boeing 737 MAX: బోయింగ్ 737 మాక్స్ విమాన రడ్డర్‌లో సమస్యలు.. అప్రమత్తమైన విమానయాన సంస్థలు..

Boeing 737 Max

Boeing 737 Max

Boeing 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ విమానంలో లూజ్ బోల్ట్ హెచ్చరికలతో భద్రతా తనిఖీలు నిర్వహించాలని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) భావిస్తోంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలో రడ్డర్‌ కంట్రోల్ లింకేజ్ మెకానిజంలో నట్ లేకుండా బోల్ట్ ఉండటాన్ని గమనించారు. దీని తర్వాత రడ్డర్ నియంత్రణ వ్యవస్థను నిశితంగా పర్యవేక్షించనున్నారు.

Read Also: TikTok: పాకిస్తాన్‌లో టిక్ టాక్ వివాదం.. సోదరిని కాల్చి చంపిన 14 ఏళ్ల బాలిక..

తనిఖీలు జరుగుతున్నప్పుడు బోయింగ్, ఇతర విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని ఎఫ్ఏఏ గురువారం తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ మరియు అలాస్కా ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం 737 మ్యాక్స్ జెట్లను కలిగి ఉన్న యూఎస్ ఎయిర్ లైన్స్. 2018-19లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదాల్లో 346 మంది చనిపోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే కొత్తగా నిర్మించిన బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌లలో లూజ్ బోల్ట్ హెచ్చరికల నేపథ్యంలో భారతదేశంలో ఈ విమానాలను నిర్వహించే ఎయిర్‌లైన్స్ కూడా అప్రమత్తమయ్యాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ విమానాలను నడుపుతున్న అకాస, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. డీజీసీఏ, యూఎస్ పౌరవిమాన సంస్థతో పాటు బోయింగ్ సంస్థలతో టచ్‌లో ఉంది.