వరుస విమాన ప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో విమానాన్ని రన్‌వేపై నిలిపివేసి, అందులోని 179 మంది ప్రయాణికులను సురక్షితంగా డీ బోర్డు చేయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, దీనితో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. Also Read: KTR: ఉమ్మడి వరంగల్లో కేటీఆర్ పర్యటన..…
Alaska Airlines Boeing 737 MAX: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 MAX విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన కొద్ధి నిమిషాలకే గాలిలో ఉండగానే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానం ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రయాణికులు ఈ ఘటనను చిత్రీకరించారు. దీంట్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
Boeing 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ విమానంలో లూజ్ బోల్ట్ హెచ్చరికలతో భద్రతా తనిఖీలు నిర్వహించాలని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) భావిస్తోంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలో రడ్డర్ కంట్రోల్ లింకేజ్ మెకానిజంలో నట్ లేకుండా బోల్ట్ ఉండటాన్ని గమనించారు. దీని తర్వాత రడ్డర్ నియంత్రణ వ్యవస్థను నిశితంగా పర్యవేక్షించనున్నారు.