Boeing 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ విమానంలో లూజ్ బోల్ట్ హెచ్చరికలతో భద్రతా తనిఖీలు నిర్వహించాలని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) భావిస్తోంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలో రడ్డర్ కంట్రోల్ లింకేజ్ మెకానిజంలో నట్ లేకుండా బోల్ట్ ఉండటాన్ని గమనించారు. దీని తర్వాత రడ్డర్ నియంత్రణ వ్యవస్థను నిశితంగా పర్యవేక్షించనున్నారు.