Indians deported: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ సర్కార్ బహిష్కరిస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్‌సర్‌కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్‌సర్ వస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: CM Yogi Adityanath: ఎంతకు తెగించార్రా.. యోగికే “టోపీ” పెడతారా..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు అక్రమ వలస వెళ్లిన భారతీయులను తీసుకుంటామని మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ఇటీవల రాజ్యసభలో జైశంకర్ మాట్లాడుతూ.. 2009 నుండి 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను యూఎస్ బహిష్కరించినట్లు చెప్పారు.
అయితే, ఇటీవల యూఎస్ నుంచి భారతీయులను తీసుకువచ్చిన విమానాన్ని అమృత్‌సర్‌లో ల్యాండ్ చేయడంపై వివాదం నెలకొంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. పంజాబ్‌ని అప్రతిష్టపాలు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎందుకు ల్యాండ్ చేయలేదని ప్రశ్నించారు.