26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
Read Also: World Idli Day: ఇడ్లీనా మజాకా.. గతేడాది 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీల డెలివరీ..
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడిగా అమీర్ ఓహానా ఉన్నారు. గత ఏడాది పదవి స్వీకరించిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటన కోసం భారత్ వచ్చారు. 2008 ముంబై అటాక్స్ లో 207 మంది మరణించారు. ఇందులో 178 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు యూదులను, ఇజ్రాయిల్, పాశ్చత్య దేశాల వారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. ముఖ్యంగా యూదులు ఎక్కువగా ఉండే నారిమన్ హౌజ్ పై దాడికి తెగబడ్డారు. ఇది భారత్ పైన మాత్రమే కాదు యూదులపై జరిగిన దాడిగా ఇజ్రాయిల్ స్పీకర్ అభివర్ణించారు.
స్పీకర్ గా నా మొదటి పర్యటన ఎక్కడికి వెళ్లాలో అని ఆలోచిస్తున్న సమయంలో భారతదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. భారత్ అభివృద్ధి చెందుతున్న ప్రధాన శక్తి అని.. ఇజ్రాయిల్ లో సంబంధాలు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఇజ్రాయిల్ లోని హైఫా నగరాన్ని రక్షించేందుకు పోరాడిన భారతీయ సైనికులకు నిశాళులు అర్పించారు. ఆయనతో పాటు చట్టసభ సభ్యుడు మైఖేల్ బిటన్, ఇజ్రాయెల్-భారత్ ఇంటర్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ఛైర్మన్ అమిత్ హలేవి కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్‌తో పాటు పలువురు ఇతర అధికారులను కలవనున్నారు.