Canada: కెనడాలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. సౌత్ వాంకోవర్‌లో 24 ఏళ్ల విద్యార్థి తన కారులో కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని చిరాగ్ ఆంటిల్గా గుర్తించారు. తుపాకీ శబ్ధాలు విన్న పొరుగువారు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వాహనంలో శవమై కనిపించాడు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటలకు ఆ ప్రాంతంలోని నివాసితులు తుపాకీ కాల్పులు విన్న తర్వాత, పోలీసులకు సమాచారం రావడంతో వారు ఈస్ట్ 55 అవెన్యూ, మెయిన్ స్ట్రీట్‌కి వచ్చారు. ఆడి కారులో మరణించిన చిరాగ్ ఆంటిల్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్యలో ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Read Also: Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
చిరాగ్ అంటిల్ సోదరుడు రోనిత్ విలేకరులతో మాట్లాడుతూ చిరాగ్ ఉదయం ఫోన్లో మాట్లాడినప్పుడు సంతోషంగానే ఉన్నాడని, ఎక్కడికో వెళ్లేందుకు తన ఆడి కారును బయటకు తీశాడని, అప్పుడే కాల్చి చంపబడ్డాడని చెప్పారు. కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి ఎక్స్ వేదికగా విద్యార్థి మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు. అతని హత్యకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.
చిరాగ్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫారమ్ గోఫండ్‌మీ ద్వారా డబ్బు సేకరిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. చిరాగ్ స్వరాష్ట్రం హర్యానా. అతనికి ఎవరితో కూడా సమస్యలు, గొడవలు లేవని, చాలా మంచి వ్యక్తి అని మృతుడి సోదరుడు రోమిత్ చెప్పారు. చిరాగ్ సెప్టెంబర్ 2022లో వాంకోవర్ వచ్చాడు, అక్కడే యూనివర్సిటీ కెనడా వెస్ట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి, ఇటివలే వర్క్ పర్మిట్ పొందాడు.
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!