Refused to love: ప్రేమ నిరాకరించిందని యువతిని మెడకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓయువకుడు. ఈఘటన కేరళలోని కన్నూర్ లో పానూరులో చోటుచేసుకుంది. కన్నూర్ కు చెందిన విష్ణుప్రియ అనే యువతిని కూతుపరంబాకి చెందిన శ్యామ్ జిత్ అనే వ్యక్తి ప్రేమించమని ఒత్తిడి చేశాడు. అయితే అతని ప్రేమకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న శ్యామ్ జిత్ .. విష్ణుప్రియను చంపేయాలని పథకం వేశాడు. ఆమె ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా ఆసమయం కోసం వేచిచూశాడు. తీరా ఆ సమయం రానే వచ్చింది. విష్ణప్రియ సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆమెను ఓకంట కనిపెట్టాడు శ్యామ్ జిత్.. కాసేపటికే విష్ణుప్రియ డ్రస్ మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు శ్యామ్ జిత్ ఇదే సమయం అన్నట్లు భావించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై దాడి చేశాడు. అతి కిరాతకంగా ఆమె మెడపై, చేతిపై తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఇంటికి వెళ్లిన యువతి ఎంత సేపటి తిరిగి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
Read also: IND Vs PAK: మెల్‌బోర్న్ వద్ద రచ్చ రచ్చ.. స్విమ్మింగ్ పోటీలైనా నిర్వహించాలని ఫ్యాన్స్ వినతి
రక్తపు మడుగులో వున్న తన కూతురిని చూసి బోరున విలపించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు బృందం విష్ణుప్రియ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేసింది. ఆమె మరణానికి ముందు ఫోన్‌కు వచ్చిన కాల్స్ శ్యామ్‌జిత్‌ను అరెస్టు చేయడానికి దారితీశాయి. సైబర్ పోలీసుల సాయంతో అతడి ఆచూకీ లభించింది. తన ప్రేమ ప్రతిపాదనను విష్ణుప్రియ తిరస్కరించడంతో శ్యామ్‌జిత్ ఆగ్రహానికి గురయ్యాడని ఆరోపణలు వచ్చాయి. విష్ణప్రియను ఉదయం 11.30 గంటలకు చంపినట్లు తెలిపారు. ఆమె ప్రేమను నిరాకరించడంతోనే తనను హత్యను చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. ఆమె తన అమ్మమ్మ మరణానంతర కర్మలకు హాజరైన తర్వాత బంధువుల ఇంటి నుండి తిరిగి వచ్చింది. మోకేరి సమీపంలోని వల్యాయికి చెందిన కన్నచంకండి వినోద్ కుమార్తె. విష్ణుప్రియ పానూరులోని ఓ ల్యాబ్‌లో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తోందని అయితే విష్ణుప్రియకు శ్యామ్ జిత్ రోజు ఆమె ట్యాబ్ కి వెళ్లి ప్రేమించమని సతాయించేవాడని కానీ.. ఆమె నిరాకరించడంతోనే అతను ఈఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. విష్ణుప్రియ మృతితో కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. అమ్మమ్మ చనిపోయిన బాధలో వున్న కుటుంబ సభ్యులకు విష్ణుప్రియ మృతి మరో విషాదంలో నెలకొందని కన్నీరుమున్నీరయ్యారు.
Chandrayan-3: వచ్చే ఏడాది చంద్రయాన్-3.. వెల్లడించిన ఇస్రో ఛైర్మన్