Site icon NTV Telugu

Kanpur: కాన్పూర్‌లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత

Kanpur

Kanpur

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

అభిజీత్ సింగ్ చందేల్(22) కాన్పూర్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం న్యాయ విద్యను అభ్యషిస్తున్నాడు. మందుల కోసం ఒక మెడికల్ షాపుకు వెళ్లాడు. అయితే మందుల విషయంలో మెడికల్ షాపు అటెండెంట్ అమర్ సింగ్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. క్రమక్రమంగా అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అమర్ సింగ్, అతడి సోదరుడు విజయ్ సింగ్, మరో ఇద్దరు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖల్ అనే మొత్తం నలుగురు వ్యక్తులు.. అభిజీత్ సింగ్ చందేల్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో అభిజీత్ కడుపు కోయడంతో పాటు చేతి వేళ్లు నరికివేశారు.

ఇది కూడా చదవండి: Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్స్‌తో మూత్రపిండాలకు ఎఫెక్ట్!

తీవ్ర రక్తస్రావం కారణంగా అభిజీత్ నేలపై కుప్పకూలిపోయాడు. అనంతరం ప్రాణాలు కాపాడాలంటూ అరుస్తూ ఒక ఇంటి వైపు పరిగెత్తాడు. దుండగులు మళ్లీ వెంటపడి చేతిలోని రెండు వేళ్లను నరికేశారు. అభిజీత్ అరుపులు విన్న స్థానిక ప్రజలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో దుండగులు పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని అభిజీత్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడికి 14 కుట్లు పడ్డాయని.. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

బాధితుడి తల్లి నీలం సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ‘‘నిందితులు.. పోలీసులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని, అదే రాత్రి తనపై, గాయపడిన తన కొడుకుపై తప్పుడు దోపిడీ కేసు నమోదు చేశారు.’’ అని ఆమె తెలిపింది. ‘‘హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి బదులుగా.. పోలీసులు ప్రాణాలతో పోరాడుతున్న నా కొడుకుపై కేసు నమోదు చేశారు.’’ అని వాపోయింది. హత్యాయత్నం ఆరోపణలపై ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ తెలిపారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని.. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్‌పై కూడా దోపిడీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. కానీ దారుణమైన దాడి గురించి నిజం బయటపడిన తర్వాత కొత్త కేసు నమోదు చేశామని ఏసీపీ కుమార్ వెల్లడించారు.

Exit mobile version