ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.