Site icon NTV Telugu

Gujarat: గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేర చరితులే.. 151 మంది కోటీశ్వరులు

Gujarat Assembly

Gujarat Assembly

22 percent of Gujarat MLAs Face Serious Cases: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. వరసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేరచరితులే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం మంది ఎమ్మెల్యేలలో 151 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. అసెంబ్లీలో 22 శాతం అంటే సుమారుగా 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అయితే 2017లో 47 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. ఈ సారి తగ్గింది. ఈ 40 మందిలో 29 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాడులు, హత్య, కిడ్నాప్, అత్యాచారం, అవినీతి ఇలా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకరిపై అత్యాచారం కేసు ఉంది.

Read Also: Geminids Meteor: ఆకాశంలో అద్భుతం.. వీక్షించే అవకాశం మిస్‌కావద్దు

బీజేపీ నుంచి గెలిచిన 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది, కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో బీజేపీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 182 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది కోటీశ్వరులే ఉన్నారు. గతంలో పోలిస్తే ఈ సారి గుజరాత్ అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది.

కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 80 శాతానికి పైగా ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిస్తే 14 మంది, 156 బీజేపీ ఎమ్మెల్యేల్లో 132 మంది కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీకి చెందిన జయంతిభాయ్ పటేల్ రూ. 661 కోట్లకు పైగా ఆస్తులతో అసెంబ్లీలోనే రిచ్చెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీకి చెందిన కోకాని మోహన్ భాయ్ ధేదాభాయ్ రూ.18.56 లక్షల ఆస్తితో అత్యంత పేద ఎమ్యెల్యేగా ఉన్నారు.

Exit mobile version