NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్ర సంక్షీర్ణంలో లుకలుకలు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి..?

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం రాబోతోందా..? అంటే శివసేన( ఉద్ధవ్) పార్టీ మౌత్ పీస్ పత్రిక అయిన ‘సామ్నా’ ఔననే అంటోంది. ఉద్దవ్ వర్గానికి మద్దతుగా సామ్నా పత్రిక కొన్ని కీలక విషయాలను పేర్కొంది. ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని, ఏక్ నాథ్ షిండే శివసేనను వీడాలని అనుకుంటున్నారని సామ్నా తన కథనంలో పేర్కొంది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే వర్గంలోని కొంత మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు.

Read Also: Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..

ప్రస్తుతం షిండే క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, అందుకే వారంతా ఆ వర్గం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారని సామ్నా పేర్కొంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన సీనియర్ శివసేన లీడర్ గజానన్ కీర్తికర్ బీజేపీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. బీజేపీ-శివసేన కూటమిలో అన్నీ సరిగా లేవని, బీజేపీ వివక్ష చూపిస్తోందని కీర్తికర్ ఆరోపించారు. 13 మంది ఏంపీలము ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్నామని, మా నియోజవర్గాల్లో సమస్యలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేని ఆయన అన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధం అవుతుందని కీర్తీకర్ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే బీజేపీ మాత్రం షిండే వర్గానికి 5-7 సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేదని సామ్నా నివేదించింది.

గతేడాది శివసేనలో అసమ్మతి రగిలింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగబాటు చేశారు. దీంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బీజేపీ – శివసేన కూటమి అధికారంలో వచ్చింది.

Show comments