Gujarat Riots Case: 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన మతఘర్షణల్లో ఇద్దరు పిల్లలతో సహా 17 మంది మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారిని హత్య చేసిన కేసులో 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది పంచమహల్ జిల్లా హలోల్ కోర్టు. సాక్ష్యాలు లేని కారణంగా వీరందరిని నిర్దోషులుగా వప్రకటించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. బాధితులను ఫిబ్రవరి 28, 2002 చంపి, సాక్ష్యాలు లేకుండా మృతదేహాలను కాల్చారు. హలోల్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్డి హర్ష్ త్రివేది.. మంగళవారం మొత్తం 22 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిలో 8 మంది కేసు పెండింగ్ ఉన్న సమయంలో మరణించారని డిఫెన్స్ లాయర్ గోపాల్ సింగ్ సోలంకి వెల్లడించారు.
Read Also: Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఏకే ఆంటోనీ కొడుకు పార్టీకి రాజీనామా..
ఫిబ్రవరి 27, 2002న పంచమహల్ జిల్లాలోని గోద్రాలో కరసేవకులతో వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ లోని బోగీలను తగలపెట్టారు కొందరు దుండగులు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువగా కరసేవలకు ఉన్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్ లో పలు ప్రాంతాల్లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని డెలోల్ గ్రామలో ఇద్దరు పిల్లలతో సహా 17 మంది సభ్యులను కొంతమంది దుండగులు హత్య చేసి, మృతదేహాలను కాల్చివేశారు. తాజాగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.
డెలోల్ గ్రామంలో జరిగిన హింసాకాండలో అల్లర్లలో పాల్గొన్న 22 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలను సేకరించలేకపోయింది. బాధితులు మృతదేహాలు ఇప్పటి దొరకలేదు. కొన్నాళ్ల తరువాత పోలీసులు నది ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి బాధితుల గుర్తింపును నిర్ధారించలేనంతగా కాలిపోయాయి.