Site icon NTV Telugu

2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!

2025 National Rewind1

2025 National Rewind1

మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరానికి గుడ్‌బై చెప్పనున్నారు. 2026 సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది జాతీయంగా అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా మహిళా మణులు చరిత్ర సృష్టించారు. వారి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కల్నల్ సోఫియా ఖురేషి
కల్నల్ సోఫియా ఖురేషి పేరు ఈ ఏడాది మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌కు కల్నల్ సోఫియా ఖురేష్ నాయకత్వం వహించారు. అలా సోఫియా ఖురేషి వెలుగులోకి వచ్చారు. దేశమంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

హర్మన్ ప్రీత్ కౌర్
హర్మన్ ప్రీత్ కౌర్.. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ ఏడాది ఆమె ఆధ్వర్యంలో మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే మహిళల ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జట్టును ముందుండి నడిపించి కప్ సాధించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్. పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

జెమిమా రోడ్రిగ్స్
ఇక హర్మన్ ప్రీత్ కౌర్‌లాగానే.. ఈ ఏడాది మహిళల క్రికెట్ జట్టులో జెమిమా రోడ్రిగ్స్ పేరు కూడా జాతీయంగా.. అంతర్జాతీయంగా బాగా మార్మోగింది. వన్డ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వీర బాదుడు బాదింది. నాటౌట్‌గా నిలిచి ఫైనల్‌కు చేర్చింది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలోనూ.. మీడియా ఛానల్స్‌లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

రేఖా గుప్తా
రేఖా గుప్తా.. ఢిల్లీ ముఖ్యమంత్రి. ఈ ఏడాది దేశ రాజధానిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ముఖ్యమంత్రి పదవి వరించింది. బీజేపీ అధిష్టానం సీనియర్లను పక్కనపట్టి రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చారు. ఇలా రేఖా గుప్తా పేరు కూడా చరిత్ర సృష్టించారు.

మైథిలి ఠాకూర్
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకుంది. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందింది. నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసి మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించారు. ఇలా అతి చిన్న వయసులో ఎమ్మెల్యే చరిత్ర సృష్టించింది.

Exit mobile version