Home Theatre Explodes: హోం థియేటర్ పేలుడు.. పెళ్లి కొడుకుతో పాటు మరొకరి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Theatre Explodes: పెళ్లిలో పెట్టిన గిఫ్టులు ఆశగా ఓపెన్ చేస్తే అది కాస్త పేలి పెళ్లి కొడుకుతో పాటు మరొకరు మరణించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న వ్యక్తి హోం థియేటర్ మ్యూజిక్ సిస్టమ్ గిప్టుగా వచ్చింది. పెళ్లయిన వ్యక్తి, అతడి అన్నయ్య హోం థియేటర్ ఓపెన్ చేసి వైర్‌ను ఎలక్ట్రిక్ బోర్డ్‌కు కనెక్ట్ చేసిన తర్వాత హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఆన్ చేయగా, భారీ పేలుడు సంభవించింది.
Also Read
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
ఈ పేలుడు ధాటికి హేమేంద్ర మెరావి (22) అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతడికి ఏప్రిల్ 1న వివాహం జరిగింది. పేలుదు ప్రభావంతో గది గోడులు, పై కప్పు కూలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ సరిహద్దులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉంది.
సోమవారం, పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులు తన ఇంట్లో పెళ్లి గిప్టులు విప్పుతున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు కబీర్ ధామ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ తెలిపారు. పెళ్లికొడుకు మెరావితో పాటు అతడి సోదరుడు (30) మరణించాడు. ఏడాదిన్నర బాలుడితో పాటు మొత్తం నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని కవ్రాధా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అప్రమత్తం అయిన ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే పేలుడుకు కారణం అయ్యే మండే వస్తువులు గదిలో కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. గదిలో పేలింది మ్యూజిక్ సిస్టమ్ మాత్రమే అని, దానికి కారణాలు తేలియాల్సి ఉందని వారు వెల్లడించారు.
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!