Waltair Railway Division: విశాఖ – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోన్న విషయం విదితమే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం విశేషం.. అయితే, అత్యధిక జనాదరణ కలిగిన రైలుగా వందే భారత్ కు గుర్తింపు లభించింది.. ఇక, అంతే కాదు.. రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ చేసిన రైల్వే డివిజన్‌గా వాల్తేరు రైల్వే డివిజన్ కొత్త రికార్డు సృష్టించింది.. ఈ విషయాన్ని వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి వెల్లడించారు.. రవాణా ద్వారా 8 వేల 389 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు తెలిపారు.. ఇక, కొత్తవలస-కిరండోల్, కొత్త వలస- రాయగడ మధ్య శరవేగంగా డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి పేర్కొన్నారు.. వాల్తేర్ డివిజన్ లో 38 రైళ్లకు ఎల్ హెచిబి కోచ్ ల అనుసంధానం పూర్తి పూర్తి అయ్యిందని.. పీఎం గతి శక్తి కింద 436 కోట్ల రూపాయలతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుంతని తెలిపారు వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి .
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 2023 జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇది 8వ వందే భారత్ రైలు.. ఆదివారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా 699 కిలోమీటర్ల దూరం కేవలం 8.30 గంటల్లో విశాఖ చేరుకుంటుంది. తిరిగి 20 నిమిషాల విరామం తర్వాత సికింద్రాబాద్ బయలు దేరుతుంది. ఇక, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటీవ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.