170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
170 Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఢిల్లీ – ఎన్సీఆర్ పరిధిలో రైళ్లలో ప్రయాణించే వారికి కీలక సమాచారం. అక్టోబర్ 10న అంటే ఈ రోజు.. ఢిల్లీ ప్రాంతంలో ప్రతిపాదించిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది.. మొత్తం 170 రైళ్లను రద్దు చేయగా, మరో తొమ్మిది రైళ్ల ప్రారంభ లేదా చివరి స్టేషన్లలో మార్పులు చేశారు.. దీంతో నిత్యం ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల కోసం రైళ్లలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావచ్చు.
ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలోని ప్రయాణికులపై ప్రభావం
రద్దయిన రైళ్లలో ఢిల్లీ, న్యూఢిల్లీ, ఘజియాబాద్, పల్వాల్, పానిపట్, కురుక్షేత్ర, అలీగఢ్, సహారన్పూర్, రోహ్తక్, రేవారి, మొరాదాబాద్ తదితర ప్రాంతాల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.. ఢిల్లీ–ఘజియాబాద్, న్యూఢిల్లీ–ఘజియాబాద్, ఢిల్లీ–పానిపట్, ఢిల్లీ–పల్వాల్, ఢిల్లీ–అలీగఢ్ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లపై ప్రధానంగా ప్రభావం పడనుంది. అలాగే ఢిల్లీ నుంచి సహారన్పూర్, షామ్లీ, రేవారి, రోహ్తక్, కురుక్షేత్ర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ మార్పులు ఉండనున్నట్లు సమాచారం. ఘజియాబాద్, న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్ మధ్య నడిచే అనేక లోకల్ రైళ్లు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ నుంచి మధుర, తుండ్లా, బులంద్‌షహర్, ఖుర్జా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తమ రైళ్ల ప్రస్తుత స్థితిని ముందుగానే తెలుసుకోవాలి.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
తొమ్మిది రైళ్ల ప్రారంభ, చివరి స్టేషన్లలో మార్పులు
మొత్తం తొమ్మిది రైళ్లను పూర్తిగా రద్దు చేయకుండా వాటి రాకపోకలను సవరించారు అధికారులు.. వీటిలో ఐదు రైళ్లను ఘజియాబాద్ నుంచి ప్రారంభించేలా మార్పులు చేయగా, మరో నాలుగు రైళ్లను ఢిల్లీ లేదా న్యూఢిల్లీలోని నిర్ణీత చివరి స్టేషన్‌కు బదులుగా ఘజియాబాద్ వరకే నడిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ–అలీగఢ్, న్యూఢిల్లీ–అలీగఢ్, ఢిల్లీ–ఖుర్జా, ఢిల్లీ–దంకోర్ మార్గాలకు సంబంధించిన రైళ్లు ఈ మార్పుల పరిధిలో ఉన్నట్లు జాబితా సూచిస్తోంది. అలీగఢ్ నుంచి ఢిల్లీ లేదా న్యూఢిల్లీకి వచ్చే కొన్ని రైళ్లు ఘజియాబాద్ వరకే పరిమితం కానున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు ఘజియాబాద్‌లో దిగి ప్రత్యామ్నాయ రైలు లేదా ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాల్సి రావచ్చు.
ప్రయాణానికి ముందు రైలు స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
రైల్వే ప్రయాణికులు స్టేషన్‌కు బయలుదేరే ముందే తమ రైలు రద్దయిందా, సమయం మారిందా, ప్రారంభ లేదా చివరి స్టేషన్లో మార్పు జరిగిందా అనే వివరాలను తనిఖీ చేసుకోవాలి. ఇందుకోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES)ను ఉపయోగించుకోవచ్చు. అలాగే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, పల్వాల్, పానిపట్ తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు రద్దు లేదా మార్గంలో మార్పుల కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!