NTV Telugu Site icon

Manipur: స్టడీ టూర్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 15 మంది విద్యార్థుల దుర్మరణం

Manipur Road Accident

Manipur Road Accident

15 students feared dead in road accident in Manipur: మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కు వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించారు. ఈ ఘటన బుధవారం నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఖౌపుమ్ ప్రాంతంలో హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Rajagopal Reddy: కవితకు రాజగోపాల్ కౌంటర్.. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ

గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యైరిపోక్ లోని తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్ కు చెందిన 36 మంది విద్యార్థులు, సిబ్బందితో కలిసి ప్రయాణిస్తున్న బస్సు బుధవారం ఉదయం 11 గంటకు రాజధాని ఇంఫాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్ సాయి గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. స్టడీ టూర్ లో భాగంగా విద్యార్థులు ఖౌపుమ్ వైపు వెళ్తున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఇంఫాల్ లోని ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుం సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సమప్ రంజన్ సింగ్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అమ్మాయిలు ప్రమాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఘటనపై మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి..ఘటన స్థలంలో సహాయకచర్యలు జరుగుతున్నట్లు.. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు.