15 Indian Fishermen Arrested By Sri Lankan Navy: శ్రీలంక నేవీ 15 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా వచ్చినట్లు ఆరోపిస్తూ వీరిందరిని శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారు. భారతీయు అరెస్టు గురించి ఆదివారం అధికారిక ప్రకటన చేసింది శ్రీలంక. మన్నార్ ద్వీపం వాయువ్య తీరంలో ఉన్న తలైమన్నార్ లో శనివారం మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు ఆ దేశ నేవీ వెల్లడించింది. ఇటీవల తరుచుగా భారత మత్స్యకారులు శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తున్నారు.
Read Also: Rajagopal Reddy: నేను అనుకున్న మోజారిటీ రాలేదు..
అనేకసార్లు ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశాలు జరిగినా కూడా ఇది పునారావృతం అవుతూనే ఉంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సవాళ్లపై భారత్, శ్రీలంకలు చర్చలు జరుపుతున్న సమయంలో ఈ అరెస్టులు జరిగాయి. 32వ అంతర్జాతీయ సరిహద్దు రేఖపై ఇరుదేశాల నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ చర్చలు జరుపుతున్నాయి.
తమిళనాడు, శ్రీలంకకు మధ్య ఉన్న ప్రాంతంలో తరుచుగా ఇరు దేశాల మత్స్యకారులు సరిహద్దులను ఉల్లంఘిస్తున్నారు. గతంలో పాల్క్ జలసంధిలో భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది కాల్పులు జరిపింది. మరోవైపు శ్రీలంక మత్స్యకారులు కూడా భారత జలాల్లోకి తరుచుగా ప్రవేశిస్తున్నారు. ఇలా వచ్చే వారిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉన్న పాక్ జలసంధి చేపల వేటకు చాలా అనుకూలంగా ఉండటంతో ఇరు దేశాల మత్స్యకారులు తెలియకుండా బోర్డర్ క్రాస్ చేస్తున్నారు.