ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్ గా నటిస్తే ఎలా ఉంటుందో? ఆ నెగటివ్ షెడ్ ని ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టెంపర్ సినిమాలోని ఎవిల్ స్మైల్ ఎన్టీఆర్ విలనిజానికి చిన్న శాంపిల్ మాత్రమే. జై లవ కుశ సినిమాలోని ‘జై’ క్యారెక్టర్ తో నెగెటివ్ రోల్‌లో భీభత్సమే సృష్టించాడు తారక్. ఇంకో రెండు క్యారెక్టర్స్ ఉన్నా కూడా ‘జై’ మాత్రమే ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతాడు అంటే తారక్ ఇచ్చిన నెగటివ్ టచ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తనతో తాను పోటీ పడితేనే ఎన్టీఆర్ ఈ రేంజ్ విలనిజం చూపించాడు అదే మరో స్టార్ హీరోతో టైగర్ తలపడితే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది.
వార్2 మూవీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వార్ సినిమా చూసిన వారంతా వార్ సీక్వెల్‌లో హీరో హృతిక్ రోషనేనని.. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు. మరి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నెగెటివ్ టచ్ ఇవ్వాలంటే చాలా లెక్కలు మారాల్సిందే. ముఖ్యంగా తారక్ రెమ్యూనరేషన్ మూడంకెలు అవ్వాల్సిందే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం 45 కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్… వార్ 2 కోసం 100 కోట్లు తీసుకుంటున్నాడని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక పై ఎన్టీఆర్ వంద కోట్ల హీరోగా ఫిక్స్ అయిపోయినట్టేనని అంటున్నారు. అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్‌గా 100 కోట్లు అందుకోబోతున్న మొదటి యాక్టర్ గా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడట. ప్రస్తుతం తారక్, కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఈ సినిమా కోసం 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది ‘వార్ 2’నే అంటున్నారు. వార్ 2 అయిన తర్వాతే ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ఉంటుందని సమచారం. వార్2 సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. ఈ సినిమాతో యంగ్ టైగర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది.